* మూసీ బాధితులను పరామర్శించనున్న బీఆర్ ఎస్
* తెలంగాణభవన్‌కు చేరుకున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు
* ఇళ్లకు రెడ్ మార్క్, సర్వే తొందరపాటు చర్యలు : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్: హైడ్రా కూల్చివేతలపై ప్రతిపక్ష పార్టీ బీఆర్ ఎస్(Brs) ఉద్యమానికి సిద్ధమైంది. బాధితులకు అండగా ఉంటామని ఇప్పటికే స్పష్టం చేసింది. ఈనేపథ్యంలో చలో హైదర్షాకోట్(Chalo Hydershacote) కు పిలుపునిచ్చింది. ఈక్రమంలో తెలంగాణ భవన్(Telanganabavan)కు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు చేరుకున్నారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబిత, జీహెచ్ఎంసీ ఎమ్మెల్యేలు హైదర్షాకోట్కు పయనం అయ్యారు. అక్కడ బాధితులతో మాట్లాడి అండగా ఉంటామని భరోసా ఇవ్వనున్నారు. బీఆర్ ఎస్ నేతల పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్(Congress)లో చేరిన దానం నాగేందర్(Danam Nagender) కూడా హైడ్రా చర్యలపై స్పందించారు. ఇళ్లకు రెడ్ మార్క్, సర్వే తొందరపాటు చర్యలన్నారు. మూసీ నిర్వాసితులకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిందని చెప్పారు.
………………………..