* తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం
* పేదల జీవితాలతో చెలగాటం
* రియల్ ఎస్టేట్ వ్యాపారిలా రేవంత్
* మేమున్నాం.. బాధితులతో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మనుషుల ప్రాణాల కన్నా.. మూసీ సుందరీకరణే ముఖ్యమా అని సీఎం రేవంత్ రెడ్డిని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు(Siddipeta Mla Harisrao) ప్రశ్నించారు. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. హరీశ్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం మూసీ(Musi), హైడ్రా(Hydra) బాధితులను పరామర్శించేందుకు హైదరాబాద్ హైదర్షా కోట్కు బయల్దేరింది. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌తో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ(Rahulgandhi) బుల్డోజర్ రాజ్యం పోవాలని ఉపన్యాసాలు ఇస్తారని, తెలంగాణలో బుల్డోజర్ రాజ్యాన్ని ఆపాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి హామీలు నెరవేర్చడానికి డబ్బులు లేవు కానీ, మూసీ సుందరీకరణకు లక్షా యాభైవేల కోట్లు ఎక్కడివని ప్రశ్నించారు. రూ.1500 కోట్లతో మూసీ సుందరీకరణ డీపీఆర్ చేస్తున్నారని.. రూ.150 కోట్లతో కనీస వైద్య సదుపాయాలు కల్పించలేరా అని ప్రశ్నించారు. హైడ్రా పేరుతో బలవంతంగా పేదల ఇళ్లు ఖాళీ చేయిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తామున్నామని బాధితులకు భరోసా ఇచ్చారు.
……………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
