* తెలంగాణలో ఓసీ చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే
* అతి త్వరలో బీసీ ఉద్యమ భూకంపం
* రాబోయే రోజుల్లో కాంగ్రెస్ బీసీలదే
* ఎమ్మెల్సీ మల్లన్న సంచలన వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : భవిష్యత్ ఎన్నికల్లో తాను పోటీచేస్తే రెడ్లు, ఓసీలు తనకు ఓటేయవద్దు అని, కేవలం బీసీలు మాత్రమే వేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ మల్లన్న(Congress Mls Mallanna) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఓసీ చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే(Cm Revanthreddy) అని స్పష్టం చేశారు. అతి త్వరలో బీసీ ఉద్యమ భూకంపం రాబోతుందని జోష్యం చెప్పారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలదే అన్నారు. 2029లో తెలంగాణకు బీసీ వ్యక్తే ముఖ్యమంత్రి అవుతారని వెల్లడించారు. రానున్నది బీసీల రాజ్యమే రాష్ట్రంలో రానున్నది బీసీల రాజ్యమని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(Mlc Teenmar Mallanna) అన్నారు.
రాజ్యాధికారంతోనే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. 54 శాతం ఉన్న బీసీలు చట్టసభల్లో నలుగురు మాత్రమే ఉండడం సరైంది కాదన్నారు. బీసీలంతా ఏకమై రాజ్యాధికారం కోసం ఉద్యమించే సమయం ఆసన్నమైందని, ఏకతాటిపైకి వచ్చి హక్కులను సాధించుకోవాలని సూచించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు రాహుల్ గాంధీ(RahulGandhi) సిద్ధంగా ఉన్నారన్నారు. కాగా, కాంగ్రెస్ ఎమెల్సీ తీన్మార్ మల్లన్నపై జాగృతి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెడ్డిలపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. రెడ్డి జాగృతి ఫిర్యాదులో పేర్కొంది.
……………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
