* సాయంత్రం మహాప్రస్థానంలో అంత్యక్రియలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Uttam Kumar Reddy) తండ్రి పురుషోత్తమ్(Purushotham reddy) రెడ్డి ఈరోజు ఉదయం మృతి చెందారు. సాయంత్రం 6 గంటలకు మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వ హిస్తారు. కాగా, హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్లో కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న పురుషోత్తమ్ రెడ్డి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. మంత్రి ఉత్తమ్ కు పితృ వియోగం సమాచారం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, వివిధ పార్టీలు నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తమ సంతాపం వ్యక్తం చేశారు. మంత్రి సీతక్క, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, సినీ నిర్మాత బండ్ల గణేశ్ తదితరులు పురుషోత్తం రెడ్డి భౌతికకాయాన్ని సందర్శించారు. సాయంత్రం అంత్యక్రియలకు మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేంద్ర కుమార్ గౌడ్(Tpcc Chief Mahendrakumar Goud) తదితరులు హాజరుకానున్నారు.
……………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
