* రెండోసారి అధ్యక్ష, కార్యదర్శులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన డాక్టర్ మోటె చిరంజీవి,అర్షం సదానందం
ఆకేరు న్యూస్, హన్మకొండ: ఆకాశవాణి వరంగల్ జిల్లా వ్యాఖ్యాతల నూతన సంఘాన్ని అదివారం హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్ లో గల నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో ఎన్నుకున్నారు. ఎన్నికల పరిశీలకులుగా డాక్టర్ పసుల ఎల్లయ్య వ్యవహరించగా నూతన అధ్యక్షుడుగా డాక్టర్ మోటె చిరంజీవి, ప్రధాన కార్యదర్శిగా అర్షం సదానందం, కోశాధికారిగా డా. పి. శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా గాదె శ్యామ్, బి.చైతన్య, సి.స్వప్న, సహాయ కార్యదర్శులుగా ఏం.స్రవంతి, కే. రామకృష్ణ చారి,గౌరవ అధ్యక్షులుగా పల్లె నాగేశ్వరరావు,గౌరవ సలహాదారులుగా డాక్టర్ పి.ఎల్లయ్య, డాక్టర్ మగ్దూం, వాణి శ్రీ,కృష్ణ,డా.డి.చంద్రశేఖర్ రావు, ప్రచార కార్యదర్శులుగా సందెల కిషోర్, గడ్డం శోభారాణి, సాంస్కృతిక కార్యదర్శులుగా బి.సుమలత, జె. శ్రీనివాస్, సమన్వయకర్తలుగా కే.భాగ్య, జీ.వాణి,కార్యవర్గ సభ్యులుగా డా.ఎం. శ్యామల, జి.స్వాతి, సంధ్యారాణి,సతీష్ లు ఎన్నికయ్యారు. రెండవసారి ఏకగ్రీవంగా అధ్యక్షులుగా డాక్టర్ మోటె చిరంజీవి, ప్రధాన కార్యదర్శి అర్షం సదానందం ఎంపికైనందుకు అసోసియేషన్ బాధ్యులు అభినందనలు తెలిపారు.
…………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
