* దసరా సందర్బంగా మాజీ మంత్రి హరీష్‌రావు పిలుపు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: గతేడాది దసరా సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నమ్మి తమ భవిష్యత్తు కోసం కాంగ్రెస్‌కు ఓటు వేయాలని గ్రామాల్లో ప్రచారం చేసిన యువత ఒక్కసారి ఆలోచించాలని మాజీ మంత్రి హరీష్‌రావు యువతకు పిలుపునిచ్చారు. గ్యారెంటీలు అమలు చేయలేకపోగా, మీ ఊళ్లలో అవ్వా, తాతలకు పెంచుతామన్న పింఛన్ పెంచలేదని.. రుణమాఫీ పూర్తి చేయలేదని.. రైతుబంధును నిలిపివేశారని.. రైతు భరోసా దిక్కులేకుండా పోయిందని.. వండ్ల బోనస్‌ను బోగస్ చేశారని హరాశ్రావు మండిపడ్డారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారని.. పది నెలలు గడిచినా అతీ గతి లేదన్నారు. ఈ దసరాకు మీ ఊళ్లకు వస్తున్న కుటుంబసభ్యులు, స్నేహితులతో అలాయ్ – బలాయ్ తీసుకుంటూ కాంగ్రెస్ చేసిన మోసాల గురించి చర్చించండన్నారు. మీ ప్రాంతాల్లోని కాంగ్రెస్ నాయకులను ఆరు గ్యారెంటీలతో పాటు, రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్లపై ఎక్కడిక్కడ నిలదీయాలని యువతకు పిలుపునిచ్చారు.
……………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
