* చెరువుల సమగ్ర సర్వే అనంతరం నిర్ణయం
ఆకేరు న్యూస్, హైదరాబాద్: హైడ్రా కూల్చివేతలను నిలిపివేయనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. హైడ్రా(Hydra)కు చట్టబద్ధత కల్పించిన రెండు రోజుల్లోనే ప్రభుత్వం ఈ తరహా నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. హెచ్ఎండీఏ(Hmda) పరిధిలోని చెరువులపై సమగ్ర సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. చెరువుల విస్తీర్ణం, ఎఫ్టీఎల్(Ftl), బఫర్‌జోన్(BufferZone)లను గుర్తించిన అనంతరం కూల్చివేతలపై నిర్ణయించినట్టు సమాచారం. మూడు నెలల్లో సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. సర్వే పూర్తయ్యాక వెబ్సైట్లో వివరాలు పొందుపరిచే అవకాశం ఉంది. అప్పటి వరకు సర్వే పూర్తయ్యే వరకు హైడ్రా కూల్చివేతలు నిలిపివేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కూల్చివేతలపై విచారణ సమయంలో చెరువుల ఎఫ్ టీఎల్ పరిధిని నిర్ధారించారా అని హైకోర్టు(High Court) ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
……………………………