* డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్ సినిమా డెస్క్ : సినీ హీరోయిన్ సమంత(Actress Samantha)పై డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్(Director Trivikram Srinivas) చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. అలియాభట్(Aliabhat) ప్రధాన పాత్రలో నటించిన జిగ్రా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం హైదరాబాద్(Hyderabad)లో జరిగింది. ఈ వేడుకకు సినిమా యూనిట్‌తో పాటు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, సమంత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తాను సమంతతో మూడు చిత్రాలకు పనిచేశానని, తెలుగు తమిళ్, మలయాళం అన్ని భాషల్లోనూ ఒకే విధమైన అభిమానులను సంపాదించుకున్న నటులలో రజినీకాంత్(Rajaneekanth) తర్వాత సమంతేనని పేర్కొన్నారు. అల్లు అర్జున్ కూడా సమంతకు పెద్ద ఫ్యాన్ అని తెలిపారు. ఇక సమంత ప్రస్తుతం ఎక్కువ సమయం ముంబయిలోనే ఉంటున్నారని, అయితే అప్పుడప్పుడూ హైదరాబాద్ కూడా రావాలని త్రివిక్రమ్ కోరుకున్నారు. ప్రేక్షకులు అందరూ సమంత హైదరాబాద్ రావడానికి దారేది అనే ట్యాగ్‌ను క్రియేట్ చేసి ట్రెండ్ చేద్దామని తెలిపారు.
……………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
