* రతన్ టాటా భౌతికకాయం సందర్శనకు తరలివస్తున్న ప్రముఖులు, ప్రజలు
* దేశానికి ఆయన చేసిన సేవలకు సలాం అంటూ నివాళ్లు
* ముంబైకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు
ఆకేరు న్యూస్, డెస్క్ : పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా(Rathan Tata) (86) ను కడసారి చూసేందుకు జనం తరలివెళ్తున్నారు. దేశానికి ఆయన చేసిన సేవలను తలచుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు. ప్రజల సందర్శనార్థం ముంబై ఎన్సీపీఏ గ్రౌండ్(NCPA) లో టాటా భౌతికకాయాన్ని ఉంచారు. ఎందరో ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అక్కడకు చేరుకుని ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారు. మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఎన్స్పీఏ గ్రౌండ్లోనే టాటా భౌతికకాయాన్ని ఉంచనున్నారు. అనంతరం ఆయన అంతిమయాత్ర మొదలుకానుంది. కేంద్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించారు.
హోంమంత్రి అమిత్ షా(AmithSha) హాజరుకానున్నారు. రతన్ టాటా విజనరీ బిజినెస్ లీడర్ అని, అసాధారణ వ్యక్తిత్వం గల దయార్ధ్ర హృదయుడని ప్రధాని మోదీ నివాళి అర్పించారు. పారిశ్రామిక రంగంపై చెరగని ముద్ర వేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(RahulGandhi) అన్నారు. దేశం ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanthreddy) సంతాపం తెలిపారు. టాటా గొప్ప మానవతావాది అని, ప్రపంచంపై తనదైన ముద్ర వేయగలరని చంద్రబాబు అన్నారు. ఏపీ కెబినెట్ రతన్ టాటాకు సంతాపం ప్రకటించింది. కాసేపట్లో సీఎం చంద్రబాబునాయుడు, మంత్రులు ముంబైకు వెళ్లనున్నారు.
……………………………………