* రబీ సీజన్లో పంటల కనీస మద్దతు ధర పెంపు
* కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు
ఆకేరున్యూస్ డెస్క్ : కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక ప్రకటనలు చేశారు. ఒకవైపు కేంద్ర ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపు కానుక ఇచ్చింది. అలాగే రైతులకు కూడా ప్రభుత్వం భారీ దీపావళి కానుక ఇచ్చింది. రబీ సీజన్లో పంటల కనీస మద్దతు ధరను కేంద్రం పెంచింది. ఇందులో గోధుమ పంటకు క్వింటాల్‌కు రూ.150, ఆవాల పంటపై క్వింటాల్‌కు రూ.300 చొప్పున పెంచారు. రైతులకు దీపావళి కానుకగా రావి పంటల ఎంఎస్పిని కూడా పెంచాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు.
…………………………………..