ఆకేరున్యూస్, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిపడిరది. ఈ నెల 23న జరగాల్సిన మంత్రివర్గ సమావేశం 26వ తేదీకి వాయిదా వేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం వెల్లడిరచారు. 26న సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. కాగా,, కేబినెట్ మీటింగ్‌లో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలతో పాటు హైడ్రా ఆర్డినెన్స్‌కు చట్టబద్ధత కల్పించడం, రెవెన్యూ చట్టం, మూసీ బాధితుల అంశం, వరద నష్టం, రైతు భరోసా తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.. ఈ మేరకు వివరాలను సిద్ధం చేయాలని సంబంధిత శాఖల అధికారులకు సీఎస్ శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు.
………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
