* ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆకేరున్యూస్, అమరావతి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్న బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు ఆన్ డ్యూటీ సదుపాయాన్ని మరో ఏడాది పొడిగించింది. ఆసియా, కామన్వెల్త్ క్రీడలతో పాటు 2025-26లో వివిధ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు శిక్షణ నిమిత్తం పీవీ సింధుకు ఆన్ డ్యూటీ సదుపాయాన్ని పొడిగించింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఆన్డ్యూటీని పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు 2016 ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించారు.
దీంతో అప్పటి తెలుగు ప్రభుత్వాలు పీవీ సింధును ఘనంగా సన్మానించడంతో పాటు నజరానా ప్రకటించాయి. అలాగే గ్రూప్-1 హోదాతో ప్రభుత్వ ఉద్యోగం కూడా ఆఫర్ చేశాయి. అయితే ఏపీలో ప్రభుత్వ ఉద్యోగం చేసేందుకు పీవీ సింధు సుముఖత వ్యక్తం చేశారు. తొలుత విజయవాడ గొల్లపూడిలోని ఏపీ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయంలో పీవీ సింధు విధుల్లో చేరారు. డిప్యూటీ కలెక్టర్ విధులు, బాధ్యతలపై శిక్షణ తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లో ఏపీ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న లేక్‌వ్యూ అతిథిగృహంలో ఓఎస్డీగా విధులు నిర్వహిస్తున్నారు.
…………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
