* నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య కలకలం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తల్లిదండ్రులు హాస్టల్ వద్ద దించి.. సగం దూరం కూడా వెళ్లనే లేదు. ఇంతలో దుర్వార్త. మీ అమ్మాయి.. స్పృహ కోల్పోయిందని. హాస్టల్ వద్దకు వెళ్లేసరికే ఆమె ఉరేసుకుని చనిపోయి ఉంది. ఈ హఠాత్పరణానికి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. హైదరాబాద్(Hyderabad) బాచుపల్లిలోని నారాయణ కాలేజీలో జరిగిన ఇంటర్ విద్యార్థిని (Inter Student) ఆత్మహత్య ఘటన విషాదాన్ని నింపింది. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన దంపతులకు ముగ్గురు కుమార్తెలు. రెండో కుమార్తె అనూష (16) బాచుపల్లి చౌరస్తాలోని నారాయణ కళాశాల(Narayana College)లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నది.
కొద్ది రోజులుగా ఇంట్లో ఉంటున్న ఆమెను తల్లిదండ్రులు ఆదివారం సాయంత్రం కారులో తీసుకొచ్చి హాస్టల్ వద్ద దించి వచ్చిన కారులోనే తిరుగు పయణమయ్యారు. అయితే వారు సగం దూరం కూడా వెళ్లకుండానే హాస్టల్ నుంచి ఫోన్ వచ్చింది. అనూష స్పృహ కోల్పోయిందని నిర్వాహకులు చెప్పారు. దీంతో హుటాహుటిన వారు తిరుగు పయణమయ్యారు. అక్కడి వెళ్లే సరికి అనూష ఉరి వేసుకుని చనిపోయిందని చెప్పారు. అయితే వారు రాకముందే మృతదేహాన్ని గాంధీ దవాఖాన(Gandhi Hospital)కు తరలించారు. దీనిపై తల్లిదండ్రులు పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. అనూష మృతిపై ఆమె తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
……………………………………..