* గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్కౌంటర్ చేయండి
* కర్ణిసేన బహిరంగ ప్రకటన
ఆకేరున్యూస్, న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్కౌంటర్ చేస్తే రూ. 1,11,11,111 రివార్డు ఇస్తామంటూ కర్ణిసేన బహిరంగంగా ప్రకటించింది. క్షత్రియ కర్ణిసేన జాతీయ అధ్యక్షులు రాజ్ షేకావత్ ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం రాజ్ షెకావత్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ విూడియాలో వైరల్ అవుతోంది. లారెన్స్ బిష్ణోయ్‌ని ఎన్కౌంటర్ చేసిన పోలీసుకు కోటి 11లక్షల 11వేల 11వందల 11 రూపాయిల రివార్డ్ ఇస్తామని తెలిపారు. కర్ణిసేనకు చెందిన సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్యకు సూత్రధారుడు, పాత్రధారుడు లారెన్స్ బిష్ణోయ్ అంటూ రాజ్ షేకావత్ వీడియోలో పేర్కొన్నారు. అదే సమయంలో దేశ ప్రజలకు భయం లేని భారతదేశం కావాలని పిలుపునిచ్చారు. ప్రజలు భయం లేకుండా జీవించాలంటే లారెన్స్ బిష్ణోయ్ వంటి వ్యక్తులు ఉండకూడదని తెలిపారు. ప్రజలను భయపెట్టే వ్యక్తులతో దేశానికి ఎప్పుడూ ప్రమాదమేనన్నారు. బిష్ణోయ్ గ్యాంగ్ అరాచకాలు వెలుగులోకి రావడంతో ప్రస్తుతం కర్ణిసేన లారెన్స్ బిష్ణోయ్‌ను లక్ష్యంగా చేసుకుంది. ఆ సంస్థ జాతీయ అధ్యక్షులు మాట్లాడుతు న్నట్లు ఉన్న వీడియో సోషల్ విూడియాలో కలకలం రేపుతోంది. కర్ణిసేనకు చెందిన సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి గత ఏడాది డిసెంబర్5న జైపూర్‌లో హత్యకు గురయ్యారు.
ఆయన హత్యకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన గోల్డీ బ్రార్ బాధ్యత వహించాడు. ఈమేరకు సోషల్ విూడియాలో పోస్టు చేశారు. గోగమేడిని రెండు మూడు సార్లు హెచ్చరించినా వినలేదని.. దీంతో కాల్చి చంపినట్లు గోల్డీ బ్రార్ సోషల్ విూడియాలో వెల్లడిరచాడు. ఈ నేపథ్యంలో లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్కౌంటర్ చేస్తే పోలీసులకు కోటి రూపాయిల రివార్డు అందిస్తామంటూ కర్ణి సేనకు చెందిన రాజ్ షెకావత్ మాట్లాడారు. పలు కేసుల్లో దోషిగా ఉన్న లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉన్నాడు. జైలు నుంచి పలు హత్యలకు బిష్ణోయ్ ఎª`లాన్ చేసినట్లు తెలుస్తోంది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఈ ఏడాది అక్టోబర్ 12న ఎన్సీపీ నాయకుడు బాబా సిద్ధిఖీని హత్య చేశారు. హీరో సల్మాన్ ఖాన్‌ను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ చాలాసార్లు బెదిరించినట్లు వార్తలు వచ్చాయి. ఎన్నో హత్యలకు కారకుడైన లారెన్స్ బిష్ణోయ్ ఎన్కౌంటర్ విషయాన్ని కర్ణిసేన తెరపైకి తీసుకువచ్చింది.లారెన్స్ బిష్ణోయ్ 1993లో పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లా ధత్తరన్‌వాలిలో పుట్టాడు. ఇతడి తండ్రి హరియాణా పోలీస్ కానిస్టేబుల్. కృష్ణ జింకలను అమితంగా ఆరాధించే బిష్ణోయ్ వర్గానికి చెందిన లారెన్స్ చండీగఢ్‌లోని పంజాబ్ యూనివర్సిటీలో చదివే సమయంలో విద్యార్థి నాయకుడు. ఇదే కమ్రంలో గోల్డీ బ్రార్ పరిచయమై నేర సామ్రాజ్యంలోకి అడుగుపెట్టాడు. కాలేజీ గ్యాంగ్ వార్‌లో తన స్నేహితురాలిని సజీవ దహనం చేయడం.. లారెన్స్‌లో తీవ్ర కసిని పెంచింది. రాజస్థాన్‌లో కృష్ణ జింకలను చంపిన కేసులో నిందితుడైన సల్మాన్‌ఖాన్‌ను హత్య చేసేందుకు ప్రణాళిక వేయడం ద్వారా లారెన్స్ వార్తల్లోకెక్కాడు. ఇతడి గ్యాంగ్ కార్యకలాపాలు పంజాబ్, ఢల్లీి, హరియాణా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్‌లకు విస్తరించాయి.
……………………………………………………………………………