ఆకేరున్యూస్, వరంగల్: శాంతి భద్రతలను పరిరక్షిస్తూ ప్రజల జీవితాలకు, రాజకీయ నాయకుల ఆస్తులకు, రక్షణ కల్పిస్తున్న పోలీసు భార్యలు మంగళవారం రోడ్డెక్కారు. కానిస్టేబుళ్లను వెట్టిసాకిరి చేపిస్తూ.. కనీసం సెలవులు కూడ ఇవ్వకుండా కుటుంబానికి దూరం చేస్తున్నారని పోలీస్ భార్యలు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ మేరకు వరంగల్ జిల్లా మామునూరు 4వ బెటాలియన్ కానిస్టేబుల్ కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. అధికారులు తమ సమస్యలను పరిష్కరించాలని కానిస్టేబుళ్ల భార్యలు రోడ్డు ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. నిరసనను ఆపేందుకు ఆర్టీఓ ఆఫీస్ నుండి మామునూరు బెటాలియన్ వరకు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు రిజర్వ్డ్ పోలీసుల బాధలను అర్థం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.
………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
