* అవన్నీ కుటుంబ వ్యాపారాలే..
* ఆస్తుల్లో వాటా అడుగుతున్నా అనడం హాస్యాస్పదం
* ఇప్పటి వరకూ ఒక్క ఆస్తీ న్యాయంగా నా చేతికి రాలేదు
* సీఎం అయ్యాక జగన్ గుర్తుపట్టలేనంతగా మారిపో్యారు..
* వైఎస్ ఆర్ అభిమానులకు షర్మిల మూడు పేజీల లేఖ
ఆకేరు న్యూస్, అమరావతి : దేశ వ్యాప్తంగా పేరు ప్రతిష్టలు ఉన్న వైఎస్. రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhar reddy) కుటుంబంలో ఆస్తుల పంపకాల రచ్చ నానాటికీ ముదురుతోంది. బహిరంగంగానే అన్నా, చెల్లెళ్లు ఒకరిపై మరొకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. వైఎస్ ఆర్ కుమారుడు, ఏపీ మాజీ సీఎం జగన్ తల్లిపైనా, చెల్లిపైనా కేసు పెట్టడం ఇప్పటికే తీవ్ర దుమారాన్ని రేపుతోంది. తాజాగా జగన్ చెల్లి, వైఎస్ఆర్ కుమార్తె, ఏపీ కాంగ్రెస్ ఛీప్ షర్మిల(Sharmila) తాజాగా మూడు పేజీల బహిరంగ లేఖ రాశారు. వైఎస్ఆర్(Ysr) అభిమానులకు వాస్తవాలు తెలియజేయడం తన బాధ్యత అంటూ పలు అంశాలను వెల్లడించారు. జగన్ ఏదైనా నమ్మించగలడంటూ లేఖను ప్రారంభించిన ఆమె వైఎస్ రాజశేఖర్రెడ్డి బతికున్న కాలం నుంచి నేటి వరకు జరిగిన ఆస్తుల విషయంలో జరిగిన అంశాలను ఆమె ప్రస్తావించారు.
రాజశేఖర్రెడ్డి స్థాపించిన అన్ని వ్యాపారాలు కుటుంబ వ్యాపారాలేనని, వాటికి జగన్మోహన్ రెడ్డి(Jaganmohan Reddy) సొంతం కాదని, ఉన్న అన్ని కుటుంబ వ్యాపారాలకు జగన్ గార్డియన్ మాత్రమేనని స్పష్టం చేశారు. “ఈరోజు పొద్దున సాక్షి(Sakshi) పేపర్ చూశాను. సాక్షి మీడియా జగన్ మోహన్ రెడ్డి గారి చేతిలో ఉంది. కాబట్టి ఏదైనా నమ్మించగలడు. అయినా YSR అభిమానులకు అసలు వాస్తవాలు తెలియజేసే ప్రయత్నం నాది.” వైఎస్సార్ బ్రతికి ఉన్నంత వరకు ఏ ఒక్క ఆస్తి (Asset) పంపకం కూడా జరగలేదని, ఈరోజు వరకు నాకు న్యాయంగా రావాల్సిన ఒక ఆస్తి కూడా నా చేతుల్లో లేదని వాపోయారు. నాన్న చనిపోయిన తరువాత జగన్ ఇబ్బందులు పడితే నా శక్తికి మించి సహాయం చేశానని, ఆయన స్థాపించిన పార్టీని ఏ స్వార్థం లేకుండా నా భుజాల మీద మోశానని పేర్కొన్నారు.
ఆ నిబంధనకు ఒప్పుకోనందునే ఆస్తులు పంచలేదు
2019లో జగన్ సీఎం అయిన వెంటనే గుర్తు పట్టలేనంతగా మారిపోయారని లేఖలో ఆరోపించారు. సీఎం అయిన నెలరోజులకే విడిపోదాం అంటూ ఇజ్రాయిల్ పర్యటనలో ప్రతిపాదన పెట్టారని అన్నారు. అమ్మ విజయలక్ష్మి మీద ఎన్సీఎల్టీలో కేసు పెట్టిన విషయం బయటకు వస్తే కుటుం ప్రతిష్ట బజారున పడుతుందన భయంతో తాము చాన్నాళ్లు మాట్లాడలేదని అన్నారు. ఒక కుమారుడు తన తల్లికి తీసుకురాకూడని పరిస్థితిని తీసుకువచ్చారని విమర్శించారు. కుటుంబ బంధం, స్నేహ బంధంతో మనుషులు ఒక్కటవుతారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్సార్ బంధం ఏర్పరుచుకున్న ప్రతి వైఎస్సార్ బంధువుకి వివరణ ఇస్తున్నానని వెల్లడించారు . జగన్(Jagan), భారతి(Bharathi), అవినాశ్(Avinash) కు వ్యతిరేకంగా ఎటువంటి వ్యాఖ్యలూ చేయవద్దన్నారు. ఆ నిబంధనకు ఒప్పుకోలేనందునే ఆస్తుల పంకాలు చేయలేదు అని షర్మిల వివరించారు.
……………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
