* కొండా సురేఖకు కోర్టు మొట్టికాయలు
* ఇంకెప్పుడు అలాంటి అడ్డగోలు వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Ktr) పై కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ(Konda Surekha) చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు(Hyderabad City Civil Court) అసహనం వ్యక్తం చేసింది. ఓ బాధ్యత గల మంత్రి చేసే వ్యాఖ్యలేనా అవి ప్రశ్నించింది. భవిష్యత్ లో ఇంకెప్పుడూ ఇలాంటి అడ్డగోలు వ్యాఖ్యలను కేటీఆర్ పై చేయవద్దని కొండాను సురేఖను ఆదేశించింది. సురేఖపై కేటీఆర్ వేసిన 100కోట్ల పరువు నష్టం దావాపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. అత్యంత జుగుప్సాకరంగా ఉన్న ఆ వ్యాఖ్యలను మీడియా, సోషల్ మీడియా, వెబ్ సైట్లు, అన్ని సోషల్ మీడియా(Social Media) ఫ్లాట్ ఫామ్స్ నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.
యూట్యూబ్, ఫేస్ బుక్, గూగుల్ సంస్థలకు కూడా ఈ వ్యాఖ్యలు ఉన్న వీడియోలను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. కొండా సురేఖ వ్యాఖ్యలను ప్రసారం చేసిన, కథనాలు ప్రచురించిన మీడియా సంస్థలకు కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ కామెంట్లకు సంబంధించిన అన్ని కథనాలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఆయా సంస్థలను కోరింది. కొండా సురేఖ వ్యాఖ్యలు సమాజంలో చెడు ప్రభావాన్ని చూపుతాయని ఆమె వ్యాఖ్యలకు సంబంధించిన అన్ని కథనాలు, వీడియోలు పబ్లిక్ డొమైన్ లో ఉండవద్దని కోర్టు తెలిపింది.
…………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
