* నా వెంట నడిచిన ప్రతి ఒక్కరిని కాపాడుకుంటా..
* నాడి పట్టుకుంటే రోగ లక్షణం చెప్పగలిగే వైద్యున్ని నేను..
* ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచందర్ నాయక్
ఆకేరున్యూస్, డోర్నకల్: మరో 30 సంవత్సరాల పాటు డోర్నకల్ నియోజకవర్గంలోనే ఉంటానని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచందర్ నాయక్ అన్నారు. శనివారం కురవిలో కార్యకర్తల సమావేశం నిర్వహించగా ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. మీలో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నాటికి నావెంట ఎందరు ఉంటారో.. ఎవరు పోతారు అన్నీ నాకు తెలుసని.. పది సంవత్సరాలు కష్టాల్లో నా వెంట నడిచిన ప్రతి ఒక్కరిని కాపాడుకుని సాద్యమైనమేర పదవులు ఇస్తానన్నారు. డోర్నకల్ నియోజకవర్గ ప్రజలు దీవించి 53వేల పైచిలుకు ఓట్ల భారీ మెజారిటీతో నన్ను గెలిపించారని వారి నమ్మకం నిలబెట్టే విధంగా ప్రతిక్షణం ప్రజలకోసమే పనిచేస్తానన్నారు. మరో 30 సంవత్సరాల పాటు డోర్నకల్ నియోజకవర్గంలోనే ఉంటానని, ప్రజల కోసమే పని చేస్తానన్నారు. ప్రతి కార్యకర్త, నాయకుడు ప్రజల కోసం, పార్టీ కోసం పని చేయాలని.. తన సొంత పనులు జాగ్రతగా చూసుకుంటూనే వ్యవస్థను అభివృద్ధి చేయడానికి కృషి చేయాలన్నారు. జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయని, ప్రతి కార్యకర్త ప్రజలకు అందుబాటులో ఉంటూ రెండు నెలలపాటు నిరంతరం ప్రతి సమస్యపై దృష్టి పెట్టాలన్నారు.
…………………………………………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
