* ఉద్యోగులకు రెండు డిఎల చెల్లింపు
* ములుగులో గిరిజన వర్సిటీకి 211 ఎకరాల భూమి కేటాయింపు
* పలు నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం
ఆకేరున్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు పండిరచే సన్న వడ్లకు రూ.500 బోనస్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి (cm evanthreddy) అధ్యక్షతన శనివారం జరిగిన కేబినెట్ భేటీ(cabinet meating)లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టులకు కూడా కేబినేట్ ఆమోదం తెలిపింది. నాగోల్, ఎల్బి ఆనగర్, హయత్‌నగర్,శంషాబాద్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎన్నికల హావిూలు సహా మేనిఫెస్టోపై చర్చించారు. ఇప్పటివరకూ వేసిన కేబినెట్ సబ్ కమిటీలు, వాటి నివేదికలపై చర్చించింది. ములుగు జిల్లాలో సమ్మక్క సారలమ్మ సెంట్రల్ వర్శిటీ(sammakka saaralamma central versity) కి ఎకరానికి రూ.250 చొప్పున భూమిని కేటాయించాలని తీర్మానించారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల పరిధి పెంపుపైనా నిర్ణయం తీసుకున్నారు. రేరాలో 54 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీకి ఆదేశాలిచ్చింది. ఏటూరునాగారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
దీపావళి పండుగ వేళ ప్రభుత్వ ఉద్యోగుల పెండిరగ్లో ఉన్న రెండు డీఏల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక డీఏ వచ్చే నెల వేతనంతో.. మరో డీఏ మార్చిలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పండుగ వేళ పెండిరగ్లో ఉన్న రెండు డీఏ విడుదలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో ఉద్యోగులు హార్షం వ్యక్తం చేస్తున్నారు. మూసీ నిర్వాసితులకు అద్భుతమైన జీవితాన్ని ఇవ్వాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. నిర్వాసితులకు వారు ఉండే చోట అద్భుతమైన టవర్స్ నిర్మించి.. వారి పిల్లలకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తామని తెలిపారు. మూసీ నిర్వాసిత మహిళలతో పాటు నగరంలోని డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు. మరోవైపు, స్థిరాస్తి వ్యాపారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బ్యాంకర్లతో చర్చించి వారికి రుణాలు అందే విధంగా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
……………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
