* కుటుంబ తగాదాల.. ఆర్థిక లావాదేవీలా?
* మృతిపై అనుమానాలు
ఆకేరు న్యూస్, తిరుపతి : ఓ ప్రైవేటు బ్యాంక్ డిప్యూటీ మేనేజర్(BANK DEPUTY MANAGER) ఆత్మహత్య చేసుకోవడం తిరుపతిలో కలకలం రేపుతోంది. తిరుపతి(TIRUPATHI)కి చెందిన వెంకటప్రసాద్ ఓ ప్రైవేటు బ్యాంకులో డిప్యూటీ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. 12 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఉద్యోగ నిమిత్తం బయటకు వెళ్లిన ఆయన ఓ లాడ్జి(LODGE)లో ఉరేసుకుని ఆత్మహత్యచేసుకున్నాడు. దీనిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన ఆత్మహత్యకు కుటుంబ కలహాలు కారణమా, బ్యాంకు ఆర్థిక లావాదేవీలా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలపై కుటుంసభ్యులను, బ్యాంకు అధికారులను ఆరా తీస్తున్నారు.
………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
