CWC Meeting
* జ్ఞానేశ్ కుమార్‌పై చర్యలపై కాంగ్రెస్ మంతనాలు
ఆకేరు న్యూస్, న్యూఢిల్లీ : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం ఇవాళ ఉదయం 10:30 గంటలకు ఢిల్లీలో జరగనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ కీలక సమావేశం నిర్వహించనున్నారు. కాంగ్రెస్ పాలిత నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యేకంగా ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
సమావేశంలో దేశంలోని తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణ, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై అభిశంసన తీర్మానం తీసుకురావడంపై కాంగ్రెస్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితా తదితర అంశాలపై కాంగ్రెస్ ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై పలు సందర్భాల్లో అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో జ్ఞానేష్ కుమార్‌పై అభిశంసన తీర్మానం దిశగా అనుసరించాల్సిన వ్యూహంపై CWCలో చర్చ జరిగే అవకాశం ఉంది.
మరోవైపు, సమావేశానికి హాజరయ్యే ముఖ్యమంత్రులు, పార్టీ అగ్రనేతలతో ఖర్గే కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. CWC భేటీ అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి నిర్ణయాలు, ప్రకటనలు వెలువడతాయన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
