* వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా
ఆకేరున్యూస్, వరంగల్ : జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం రోడ్ల భవనాల శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల కారణంగా ఏ ఒక్కరూ వైకల్యం బారిన పడకుండా, ప్రాణాలు కోల్పోకుండా ప్రమాదాలు జరగకుండా రోడ్డు భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు సక్రమంగా లేకపోవడం, సైనేజ్బో ర్డు లు, అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్ లు లేకపోవడం వల్ల అక్కడక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. సంబంధిత ఇంజనీరింగ్ శాఖలు అలాంటి ప్రదేశాలను గుర్తించి వెంటనే అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై పోలీస్,రవాణా ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. పట్టణాలలో సరయిన పార్కింగ్ స్థలాలు లేక రోడ్లపైనే పార్కింగ్ చేసే చేస్తున్నారని, మున్సిపల్ అధికారులు పార్కింగ్ స్థలాలను గుర్తించాలన్నారు. గతంలో సమావేశంలో గుర్తించిన 17 బ్లాక్ స్పార్ట్స్ పై తీసుకొన్న చర్యలపై సమీక్షించారు. గతంలో బ్లాక్ స్పాట్స్ ను గుర్తించిన 17 పనులలో 15 పనులు పూర్తి చేశారని మిగతా పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. యువత ట్రిబుల్ బైక్ డ్రైవింగ్ చేస్తున్నారని, ఓవర్ టేక్ డ్రైవింగ్ చేయకుండా కళాశాలల విద్యార్థిని విద్యార్థులకు రోడ్ భద్రత, ప్రమాదాలు నివారించుటకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. హైవే రోడ్ల పైన స్పీడ్ బ్రేకర్స్ అలాగే,మూల మలుపుల వద్ద హెచ్చరిక బోర్డ్స్ ఏర్పాటు చేయించాలని అన్నారు. టూ విల్లర్ పై వెళ్ళుటకు రోడ్లకు ఇరు వైపుల మార్క్స్ ను తరచూ పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఫోర్త్ లైన్స్ రోడ్స్ ఉన్నచోట్ల ప్రజలకు ఇబ్బంది కలుగకుండా క్యాష్ బెరియర్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. అలాగే రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో వాహనాల వేగాన్ని నియంత్రించుటకు డబుల్స్ స్టిక్స్ ను ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బీ అధికారులకు సూచించారు. 18.సంవత్సరాల లోపు పిల్లల డ్రైవింగ్ చేయకుండా చూడాలని, హైవేలలో చీకటి వల్ల ప్రమాదాలు కలిగే అవకాశం ఉన్నందున సరైన లైటింగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అన్నారు. ఈ సందర్భంగా డిసిపి రవీందర్ మాట్లాడుతూ మామునుర్ ఎయిర్పోర్ట్ హైవే ప్రాంతంలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నందున స్పీడ్ బ్రేకర్లు తో పాటు సిసి కెమెరాలు ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి డిసిపి రవీందర్, ఆర్ అండ్ బి అధికారి జితేందర్ రెడ్డి, జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి జైపాల్ రెడ్డి ,జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి జ్ఞానేశ్వర్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సతీష్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రోడ్ సేఫ్టీ హైదరాబాద్ రవి , టిజిఆర్టీసీ డి ఎం మోహన్ రావు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
………………………………………