
ఆకేరున్యూస్, హనుమకొండ: హనుమకొండ జిల్లాకు సంబంధించి రెండు నియోజకవర్గాలైన పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్ల ముసాయిదా ప్రచురణ జాబితాను హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎ. వెంకట్ రెడ్డి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో విడుదల చేశారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలోని ఓటర్ల ముసాయిదా జాబితా ప్రచురణ పై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఓటర్ల ముసాయిదా జాబితా పై ఏవైనా అభ్యంతరాలు, మార్పులు చేర్పులు ఉన్నట్లయితే మరియు నూతనంగా ఓటరు నమోదు చేసుకునేవారు నవంబర్ 28వ తేదీ వరకు సంబంధిత ఓటరు నమోదు అధికారి మరియు రెవెన్యూ డివిజినల్ అధికారికి గాని తహసిల్దార్ కార్యాలయాలలో గాని, ఆన్లైన్ ద్వారా https://voters.eci.gov.in/ ద్వారా గాని Voter Helpline ద్వారా గాని %పశ్ీవతీ నవశ్రీజూశ్రీఱఅవ% మొబైల్ ఆప్ ద్వారా గాని నమోదు చేసుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఓటర్ల జాబితాకు సంబంధించిన ప్రచురణ జాబితా, సిడిని రాజకీయ పార్టీల ప్రతినిధులకు అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి అందజేశారు. ఈ సమావేశంలో ఇలా రెవెన్యూ అధికారి వైవి గణేష్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ ప్రసాదరావు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇ.వి. శ్రీనివాస్ రావు, రావు అమరేందర్ రెడ్డి, ఎండి నేహల్, రజనీకాంత్, సయ్యద్ ఫైజుల్లా, మణి, లక్ష్మణ్, శ్యాంసుందర్, తదితరులు పాల్గొన్నారు.
………………………………………