ఆకేరున్యూస్ డెస్క్: టియాన్గాంగ్ స్పేస్ స్టేషన్కు చైనా ముగ్గురు వ్యోమగాములను పంపింది. షెంజౌ-19 మానవసహిత స్పేస్షిప్ను చైనా ప్రయోగించింది. లాంగ్ మార్చ్-2ఎఫ్ రాకెట్ ద్వారా ముగ్గురు టైకోనాట్లు నింగిలోకి వెళ్లారు. బుధవారం తెల్లవారుజామున 4.27 నిమిషాలకు జిక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి రాకెట్ ఎగిరింది. ఈసారి వ్యోమగాముల్లో మహిళా టైకోనాట్ కూడా ఉంది. టియాన్గాంగ్ స్పేస్ స్టేషన్లో వ్యోమగామలు పలు పరీక్షలు చేపట్టనున్నారు. 2030 నాటికి చంద్రుడి మీదకు చైనా వ్యోమగాములను పంపాలని భావిస్తున్నది. లూనార్ కేంద్రాన్ని నిర్మించాలనుకుంటున్న చైనా ఆ ప్రయత్నాలు మొదలుపెట్టింది.
………………………………….