Published:
Updated: 02 Nov 2024 • 10:36 AM
* హైదరాబాద్కు తరలింపు
ఆకేరున్యూస్, పెద్దపల్లి: ముత్తారం కేజీబీవీలో అస్వస్థతకు గురైన విద్యార్థుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. 53 మంది విద్యార్థినిలు ఆదివారం రాత్రి పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానలో చేరగా.. ముగ్గురి ఆరోగ్య పరిస్థితి మెరుగు పడకపోవడంతో రేవతి, సునీత, రక్షితలను హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్కు తరలించినట్లు అధికారులు తెలిపారు. కాగా, పెద్దపల్లి జిల్లాలోని ముత్తారం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో దాదాపు 60 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే వారిని పెద్దపల్లి దవాఖానకు తరలించి చికిత్స అందించారు.
……………………………………………
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
