* సీఎం రేవంత్ రెడ్డి
* ఇందిరాగాంధీ, సర్ధార్ వల్లబాయ్ పటేల్ కు సీఎం నివాళి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : దివంగత ప్రధాని ఇందిరాగాంధీ(INDHIRAGANDHI) పాలనలో దేశంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారని, అభివృద్ధికి బీజం పడింది అప్పుడే అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(TELANGANA CM REVANTHREDDY) తెలిపారు. ఆమె వర్ధంతి, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి నేపథ్యంలో ఇద్దరు నేతలకూ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సీఎం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంచలన నిర్ణయాలకు ఇందిరాగాంధీ నాంది పలికారని తెలిపారు. అనంతరం పీవీ నరసింహారావు(PV NARASIMHARAO) భూ సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రూ మంచి స్నేహితులన్నారు. తెలంగాణలో మళ్లీ ఇందిరమ్మ రాజ్యం తెస్తామన్నారు. నేతలకు నివాళి అర్పించిన వారిలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి(KOMATIREDDY VENKATREDDY), పొన్నం ప్రభాకర్(PONNAM PRABHAKAR), సీనియర్ నేత వీహెచ్(VH), టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్(MAHESHKUMAR GOUD), ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తదితరులు ఉన్నారు.
……………………………………………………..