* నటి, బీజేపీ ఎంపీపై ఆప్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, డెస్క్ : నగరంలోని రోడ్లను హేమమాలిని (Hema Malini) బుగ్గల్లా అందంగా, నున్నగా చేస్తానని ఆప్ ఎమ్మెల్యే (AAP MLA )నరేష్ బల్యాన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీనిపై బీజేపీ సహా మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఉత్తమ్ నగర్ (Uttam Nagar)రోడ్లను నటి, బీజేపీ ఎంపీ హేమ మాలినీ బుగ్గల్లా నున్నగా (Road like Hema Malinis cheeks) చేస్తానని నగర పర్యటనలో ఆప్ ఎమ్మెల్యే నరేష్ బల్యాన్(Naresh Balyan) వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆయన వ్యాఖ్యలు మహిళలను అగౌరవపరిచేలా, స్థానిక సమాజాన్ని అవమానించేలా ఉన్నాయన్నారు. ఓ మహిళను అగౌరవపరిచేలా మాట్లాడిన ఎమ్మెల్యేపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆప్ సుప్రిమో అరవింద్ కేజ్రీవాల్‌ను డిమాండ్ చేశారు. గతంలో కూడా మహారాష్ట్ర మంత్రి ఒకరు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. దీనిపై హేమమాలిన మండిపడ్డారు. సాధారణ ప్రజలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదని, బాధ్యత గల ప్రజాప్రతినిధులు ఇలా మాట్లాడ్డం సరికాదని హితవు పలికారు. ఇప్పుడు ఆప్ ఎమ్మెల్యే(Aap Mla) వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో చూడాలి.
…………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
