
* ఇంటింటికీ ఎన్యూమరేటర్లు
* సర్వే దరఖాస్తులో 75 పేర్లు
* ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ(TELANGANA)లో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల గణన ( సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) ప్రారంభమైంది. ఎన్యూమరేటర్లు(ANUMARATORS) ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరణలో ఉన్నారు. మొత్తం 75 ప్రశ్నలతో ఉన్న సమగ్ర కుటుంబ సర్వే(SURVEY)లో కుటుంబ యాజమాని, సభ్యుల వివరాలు పొందుపరచనున్నారు. జీహెచ్ ఎంసీ (GHMC)పరిధిలో మొత్తం 28 లక్షల 26వేల 682 గృహాలపై సర్వే సేకరించనున్నారు. కంటోన్మెంట్ పరిధిలో 50వేల ఇళ్లలోను.. జీహెచ్ఎంసీ పరిధిలో 27లక్షల 76వేల 682 గృహాలపై సర్వే చేపట్టనున్నారు. ప్రతి 150 నుంచి 170 ఇళ్లను ఒక బ్లాక్‌గా గుర్తించారు. 56 ప్రధాన, 19 అనుబంధ ప్రశ్నలతో కలిపి మొత్తం 75 ప్రశ్నల(74 QUESTIONS)తో సమగ్ర సమాచారాన్ని తీసుకుంటారు.
పార్ట్-1, పార్ట్-2 కింద ఎనిమిది పేజీల్లో ఈ సమాచారాన్ని పూరిస్తారు. మొదటి భాగం (పార్ట్-1)లో కుటుంబ యజమాని, సభ్యుల వ్యక్తిగత వివరాలు తెలపాల్సి ఉంటుంది. పార్ట్-1లో మొత్తం 60 ప్రశ్నలు ఉంటాయి. రెండో భాగంలో ఆస్తులు, అప్పులు, ఇంటికి సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి. ఈ సర్వేలో ప్రధాన ప్రశ్నలతోపాటు 19 ఉప ప్రశ్నలకు జవాబులు ఇవ్వాల్సి ఉంటుంది. సమగ్ర సర్వేకి వచ్చే సిబ్బంది మిమ్మల్నిగానీ, మీ కుటుంబీకులను గానీ ఫోటోలు తీయరు. అడగరు. ఎలాంటి ధృవీకరణ పత్రాలు తీసుకోరు. కుటుంబంలో అందరూ ఉండాల్సిన అవసరంలేదు. కుటుంబ యజమాని అందుబాటులో ఉండి వివరాలు చెబితే సరిపోతుంది.
…………………………………………..