* కేంద్ర మంత్రి అమిత్ షా
ఆకేరున్యూస్, న్యూఢల్లీి: జార్ఖండ్‌కు చెందిన గిరిజన మహిళను ఎవరైనా చొరబాటుదారులు పెళ్లి చేసుకుంటే, వాళ్లకు పట్టా భూములను ఇవ్వమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. సెరైకేలాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే, చొరబాటుదారులకు భూమి బదలాయింపును నిలిపివేసే చట్టాన్ని రూపొందిస్తామన్నారు. మన కూతుళ్లను పెళ్లి చేసుకున్న చొరబాటుదారులు మన భూమిని లాక్కుంటున్నారని, గిరిజన మహిళను పెళ్లి చేసుకుంటే జరిగే భూ బదలాయింపు ప్రక్రియను అడ్డుకునేందుకు చట్టాన్ని తెస్తామని పేర్కొన్నారు. చొరబాటుదారుల్ని గుర్తించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని, ఆ చొరబాటుదారుల నుంచి భూమిని తిరిగి లాక్కుంటామని మంత్రి పేర్కొన్నారు. బంగ్లాదేశీ చొరబాటుదారులకు జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ మద్దతు నిలుస్తున్నాయని ఇటీవల ప్రధాని మోదీ కూడా తన ప్రసంగంలో ఆరోపించారు.
……………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
