Vasavi Sevadal Venkanna
* రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియామకం
ఆకేరు న్యూస్, పాలకుర్తి: తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ వాసవి సేవాదళ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన మాదంశెట్టి వెంకన్న నియమితులయ్యారు. సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యాలయంలో నిర్వహించిన వాసవి సేవాదళ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.
* నియామక పత్రం
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, వాసవి సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మంకాళి విజయ్ కుమార్ చేతుల మీదుగా వెంకన్న నియామక పత్రాన్ని స్వీకరించారు.
* సేవా కార్యక్రమాల విస్తరణకు కృషి
రాష్ట్రస్థాయిలో వాసవి సేవాదళ్ కార్యక్రమాలను విస్తృతంగా ముందుకు తీసుకెళ్లడంతో పాటు, సేవా కార్యక్రమాల సమన్వయంలో తన వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని వెంకన్న తెలిపారు. వాసవి సేవాదళ్ ద్వారా సమాజ సేవ, సేవా కార్యక్రమాలు, ఆర్యవైశ్య సమాజ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని పేర్కొన్నారు.
* నాయకుల అభినందనలు
వెంకన్నకు రాష్ట్రస్థాయి బాధ్యతలు దక్కడంపై పాలకుర్తి మండలానికి చెందిన ఆర్యవైశ్య సంఘాల నాయకులు, వాసవి సేవాదళ్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు. తనను రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమించేందుకు సహకరించిన జనగామ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు డాక్టర్ గంగిశెట్టి ప్రమోద్ కుమార్, జనగామ జిల్లా వాసవి సేవాదళ్ అధ్యక్షుడు నాగమళ్ళ సోమేశ్వర్తో పాటు జనగామ జిల్లా ఆర్యవైశ్య మహాసభ, పాలకుర్తి మండల ఆర్యవైశ్య నాయకులకు వెంకన్న ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
