* 84 కాల్స్ గుర్తించిన పోలీసులు
* లగచర్ల దాడి వెనుక కుట్రను ఛేదించే పనిలో పోలీసులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : లగచర్ల(LAGACHARLA) లో కలెక్టర్, అధికారులపై దాడి వెనుక కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రధాన నిందితుడు సురేష్ కాల్ డేటా(SURESH CALL DATA)ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఫార్మా కంపెనీ(FORMA COMPANY)కి వ్యతిరేకంగా రైతులు ఆందోళన మొదలు పెట్టిన నాటి నుంచి నిందితుడు సురేష్, పట్నం నరేందర్ రెడ్డి రోజూ కాల్ మాట్లాడుకున్నట్లు గుర్తించారు. వారి మధ్య 84 కాల్స్(PHONE CALLS) ను గుర్తించారు. ఈ కేసులో ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డి(PATNAM NARENDER REDDY)ని కూడా పోలీసులు విచారించనున్నారు. మరోవైపు లగచర్ల ఘటనపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దాడులకు పాల్పడితే వెనక్కి తగ్గుతామా, నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని అధికారపక్షం ఉంటే, ఏం చేసుకుంటారో చేసుకోండి.. బెదిరేదే లే అంటూ ప్రతిపక్షం సవాల్ విసురుతోంది.
…………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
