* బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్
ఆకేరు న్యూస్, సంగారెడ్డి : తాము అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి(Revanthreddy)ని వదిలిపెట్టేది లేదని బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(Ktr) హెచ్చరించారు. లగచర్ల రైతుల ఆందోళనలకు రాజకీయ రంగు పులుముతున్నారని ఆరోపించారు. లగచర్ల ఘటనలో అరెస్టయి సంగారెడ్డి సెంట్రల్ జైలు(Sangareddy Central Jail)లో ఉన్నవారిని పరామర్శించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక ఏం చేయాలో తెలుసునని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫార్మా కంపెనీలను వ్యతిరేకించిన రేవంత్.. ఇప్పుడు ఎలా వాటికి మద్దతు తెలుపుతున్నారని ప్రశ్నించారు. కొడంగల్(Kodangal)కు రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి(Tirupathireddy) రారాజా అన్నారు. అధికారులకు ఆయనే ఆదేశాలు ఇస్తున్నారని విమర్శించారు. అధికారులపై దాడులు చేసిన వారిలో కాంగ్రెస్ వాళ్లు ఉన్నారని, వారిపై ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదన్నారు. బీఆర్ఎస్ కు చెందిన వారి పేర్లే ఈ కేసులో పెట్టారన్నారు. కులగణనలో పాల్గొన్న వ్యక్తిని కూడా అక్రమంగా అరెస్ట్ చేశారని ఆయన ఆరోపించారు. వనపర్తి జిల్లాలో ఐటీఐ చదువుకుంటున్న విద్యార్థి కూడా ఈ కేసులో అరెస్ట్ చేశారని ఆయన అన్నారు. ఈ కేసులో అరెస్టైన వారికి న్యాయ సహాయం చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
……………………………….