* ఆదివాసీ మహిళ ముర్మును రాష్ట్రపతిని చేశాం
* పీఎం జన్మన్ యోజన పథకం ఘనత ముర్ముదే
* బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా నివాళి
* బిర్సాముండా పేరిట పోస్టల్ స్టాంపు ఆవిష్కరణ
* ఆదివాసీలను గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి
* ప్రధాని నరేంద్ర మోదీ
ఆకేరున్యూస్, పాట్నా: దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఓ ఆదివాసీ మహిళకు తమ ప్రభుత్వం అత్యున్నత రాష్ట్రపతి పదవిని ఇచ్చి గౌరవించిందని ప్రధాని నరేంద్ర మోదీ ( NARENDRA MODI) అన్నారు. పీఎం జన్మన్ యోజన పథకం ద్వారా పనుల ప్రారంభ ఘనత ద్రౌపదీ ముర్ముదే అని కొనియాడారు. ఆదివాసీల కష్టాలను తీర్చేందుకు ఈ పథకం ద్వారా రూ.24వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని ప్రధాని నరేంద్రమోదీ వెల్లడిరచారు. బిహార్లో నిర్వహించిన సభలో ప్రధాని పాల్గొని మాట్లాడారు. ఆదివాసీలు తమ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ధర్తీ అబా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా బీహార్లోని జాముయ్లో ప్రధాని మోడీ ఆయనకు నివాళులర్పించి, ఆయన పేరిట పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. 6000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు. గిరిజన సమాజాన్ని నిర్లక్ష్యం చేయడానికి గత ప్రభుత్వాలే కారణమని ప్రధాని మోడీ అన్నారు. గత ప్రభుత్వాల వల్ల గిరిజన సమాజం నిర్లక్ష్యానికి గురైందన్నారు. గిరిజన సమాజం దేశాభివృద్ధి రేసులో వెనుకబడిరది. దేశ స్వాతంత్యాన్రికి ఒక పార్టీ లేదా ఒక కుటుంబం సహకరించిందని చేసే ప్రచారం తప్పన్నారు. ఆదీవాసీలకు చదువు, సంపద, వైద్య సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. వారి సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేశామని.. బడ్జెట్ను రూ.25,000 కోట్ల నుంచి రూ.1.25 లక్షల కోట్లకు పెంచామని ప్రధాని వెల్లడిరచారు.
………………………………………..