* ఇప్పటికే 30శాతం సర్వే పూర్తి
* రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
ఆకేరున్యూస్, సిద్దిపేట: కొందరు కావాలనే వారి ప్రయోజనాల కోసం సమగ్ర సర్వేపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అలా చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ( PONNAM PRABHAKER ) హెచ్చరించారు. సర్వేలో ఎలాంటి బ్యాంక్ వివరాలు అడగటం లేదని స్పష్టం చేశారు. 87వేల ఎన్యుమరేటర్లను పెట్టీ సర్వే జరిపిస్తున్నామని అన్నారు. ఇప్పటికే 30శాతం సర్వే పూర్తి అయ్యిందని తెలిపారు. సర్వే వల్ల ఎలాంటి నష్టం జరగదన్నారు. కొండపాక మండలం దుద్దేడలో శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… దేశానికి దిక్సూచిగా సర్వే నిలబడుతుందన్నారు. సర్వే కావాలని కోరిన వారే నేడు కనబడటం లేదన్నారు. సర్వేను అడ్డుకున్న వారిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.
…………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
