* రసవత్తరంగా మూసీ పోరు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : దమ్ముంటే మూసీ పరివాహక ప్రాంతంలో నివాసం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సవాల్ ను బీజేపీ స్వీకరించింది. పార్టీ కీలక నేతలు మూసి బస్తీల్లో నేడు నిద్ర చేయనున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి రేపు ఉదయం 9 వరకు 20 మంది బీజేపీ నేతలు వివిధ ప్రాంతాల్లో బస చేస్తారు. అక్కడే రాత్రి భోజనం, నిద్ర, మరుసటి రోజు అల్పాహారం తీసుకుంటారు. మూసీ పరీహవాక ప్రాంతాల్లోని బస్తీలలో బస చేయనున్నారు. పేదల సమస్యలు తెలుసుకుంటారు. ఇళ్ళు ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంపై వారి అభిప్రాయం తెలుసుకొనున్నారు. తాము ఉన్నామనే భరోసా ఇవ్వనున్నారు.
ఏ ప్రాంతంలో ఎవరంటే..
బీజేపీ ముఖ్య నేతలు ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతంలో బస చేస్తారు. అంబర్‌పేటలోని తులసీరాంనగర్‌లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఓల్డ్ మలక్‌పేటలోని శాలివాహననగర్‌లో కే లక్ష్మణ్, ఎల్బీ నగర్‌లోని గణేశ్ నగర్లో ఎంపీ ఈటల రాజేందర్, రాజేంద్రనగర్‌లోని హైదర్షా కోటలో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అఫ్జల్‌గంజ్‌లోని రెసిడెన్షియల్ హౌసింగ్ బస్తీలో బీబీ పాటిల్ బస చేయనున్నారు. వారితో పాటు ఆయా ప్రాంతాల స్థానిక నేతలు కూడా బస చేస్తారు. స్థానిక నేతలు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. కాగా బీజేపీ బస్తీ నిద్రపై కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. మూసి పునరుజ్జీవం అడ్డుకునేందుకే బీజేపీ ప్రయత్నం చేస్తోందని ఎంపీ చామల కిరణ్ విమర్శలు చేశారు. గంగ, సభర్మతీ నదుల్లా మూసి అభివృద్ధికి ప్రభుత్వానికి సహకరించాలని కోరుతున్నారు.
…………………………………………..