Published:
Updated: 18 Nov 2024 • 05:53 AM
* కౌలు రైతుల సమస్యలను పరిష్కరించాలి..
* మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు
ఆకేరున్యూస్, హైదరాబాద్: రేవంత్ సర్కార్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు( HARESH RAO) మండిపడ్డారు. కౌలు రైతుల సమస్యలకు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌలు రైతులకు రైతు భరోసా దేవుడెరుగు.. వాళ్లు పండిరచిన పత్తిని మద్దతు ధరకు అమ్ముకోలేని దుస్థితికి వారి పరిస్థితి దిగజారిందని హరీశ్‌రావు అన్నారు. కౌలు రైతుల సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలన్నారు. పత్తి పండిరచిన కౌలు రైతుల సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.
………………………………….
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
