Mahendra Bhatt Kharge Remarks
* ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పై అనుచిత వ్యాఖ్యలు సరికాదు
* కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ : కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉత్తరాఖండ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు మహేంద్ర భట్‌పై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేపూరి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ పోలీస్ స్టేషన్లో సోమవారం ఎంపీ మహేంద్ర భట్‌పై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ ఉత్తరాఖండ్ రామ్ లీలా మైదానంలో జరిగిన బహిరంగ సభ అనంతరం శుద్ధీకరణ చేసిన ఘటన సమర్ధించిన మహేంద్ర తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. 80 ఏళ్ల స్వతంత్ర భారతంలో కులం, మతం, అంటరానితమంటూ ఎంపీ వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించాలని అతడిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పీఎస్‌లో ఫిర్యాదు చేసిన వారిలో ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు నలిమెల ఏలియా, మార్కెట్ డైరెక్టర్ మారపాక వసంత్, నాయకులు భాస్కుల రామచంద్రం, చేపూరి రాజేష్, ఐలపాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
