* కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
ఆకేరున్యూస్ డెస్క్: లగచర్లలో అధికారులపై దాడి కేసులో కీలక నిందితుడు బోగమోని సురేశ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. దీంతో సురేశ్‌ను కొడంగల్ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. కలెక్టర్‌పై దాడి కేసులో సురేశ్‌ను ఏ2గా పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఘటన జరిగిన నాటి నుంచి పరారీలో ఉన్న నిందితుడు మంగళవారం ఉదయం పోలీసుల ఎదుట ప్రత్యక్షమయ్యాడు. కలెక్టర్ బృందాన్ని ప్రజాభిప్రాయ సేకరణ వేదిక వద్ద నుంచి ఊరిలోకి తీసుకెళ్లడంలో సురేశ్ కీలకంగా వ్యవహరించాడు. అక్కడికి వెళ్లిన వెంటనే ఆందోళనకారులు నినాదాలు చేస్తూ ముందుకు దూసుకురావడంతో గందరగోళం నెలకొంది. ఆ సమయంలో సురేశ్ సైతం నినాదాలు చేసినట్లు వీడియోల్లో కనిపించడంతో ఆయనే పక్కా పథకంతో అధికారులను అక్కడికి రప్పించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అప్పటికే వారిని రెచ్చగొట్టి దాడికి సిద్ధం చేసి ఉంటాడని.. కలెక్టర్ వాహనం దిగిన క్షణాల వ్యవధిలోనే ఆందోళనకారులు ఆయనపైకి దూసుకురావడంతో పాటు వెంకట్‌రెడ్డిని వెంటాడి కొట్టేందుకు అదే కారణమై ఉంటుందని నమ్ముతున్నారు. సురేశ్‌ను పోలీస్ కస్టడీకి తీసుకొని విచారించే అవకాశముంది. అయితే ఘటన జరిగిన నాటినుంచి సురేశ్ అదృశ్యమయ్యాడు. పోలీసుల తనిఖీ ముమ్మరం కావడంతో పోలీసులు ఎదుట లొంగిపోయాడు.
………………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
