
* 10 మంది మావోయిస్టుల హతం
ఆకేరు న్యూస్ డెస్క్ : చత్తీస్గఢ్ (CHATHISGHAD)లోని సుక్మాజిల్లాలో భారీ ఎన్కౌంటర్ (ENCOUNTER) జరిగింది. భద్రతాదళాలు, మావోయిస్టులు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు హతమైనట్లు సమాచారం. ఘటనాస్థలంలో పోలీసులు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్ కౌంటర్లో మృతి చెందిన మావోల వివరాలు సేకరిస్తున్నారు. భెజ్జీ ప్రాంతం కుంటా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగినట్లు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో మావోల కోసం వేట కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఎన్కౌంటర్ జరిగినట్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కిరణ్ చవాన్ ధృవీకరించారు. ఎన్కౌంటర్ ప్రాంతం నుంచి మూడు ఆటోమేటిక్ తుపాకులతో పాటు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
………………………