ఆకేరు న్యూస్ డెస్క్ : సౌర విద్యుత్తు రంగంలో పెద్దయెత్తున పెట్టుబడులు పెట్టాలనే ప్రయత్నాల్లో భాగంగా అదానీ గ్రూప్(ADANI GROUP) కాంట్రాక్ట్ టెండర్లను దక్కించుకొనేందుకు ఏపీ, ఒడిశా, తమిళనాడు, జమ్ముకశ్మీర్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని ఉన్నతాధికారులకు రూ. 2,238 కోట్ల మేర లంచాలు ఆఫర్ చేసినట్టు అమెరికా ఎఫ్‌బీఐ వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై అదానీపై అమెరికాలో కేసు నమోదైంది. యూఎస్ కోర్టు అరెస్టు వారెంట్ కూడా జారీ చేసింది. భారత్‌లో సోలార్ పవర్ ప్రాజెక్టులు దక్కించుకోవడానికి అదానీ గ్రూప్.. వివిధ రాష్ట్రాల్లోని ఉన్నతాధికారులకు 265 మిలియన్ డాలర్లు (రూ. 2,238 కోట్లు) లంచంగా ఇవ్వజూపినట్టు న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి. ఇదే విషయమై ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై తాజాగా అమెరికా (America) స్పందించింది. ఈ సంక్షోభాన్ని ఇరు దేశాలు అధిగమించగలవని తాము విశ్వసిస్తున్నట్లు అధ్యక్ష భవనం శ్వేతసౌధం (White House) ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఆరోపణలపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్, న్యాయశాఖనే సరైన నిర్ణయం తీసుకుంటుందని శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరీన్ జీన్ పియర్ తెలిపారు.
…………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
