
* కేటీఆర్ పిలుపు
ఆకేరున్యూస్, హైదరాబాద్: కాంగ్రెస్ నుండి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను కాపాడుకోవాలని మరో సంకల్ప దీక్ష చేపట్టాల్సిన తరుణం ఆసన్నమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ పాలనలో ప్రతి వర్గం, ప్రతి మనిషి బతుకు చిధ్రమైన పరిస్థితి వచ్చిందని.. మళ్లీ ఇవాళ ఆ పరిస్థితితులు తిరిగి కనబడుతున్నాయన్నారు. నాడు ఢల్లీి మెడలు వంచి తెలంగాణ సాధించిన కేసీఆర్ స్ఫూర్తితో నేడు మళ్లీ రెండు ఢల్లీి పార్టీ మెడలు వంచాల్సిన పరిస్థితి ఏర్పడిరదన్నారు. కాంగ్రెస్కు అధికారం ఇస్తే తిరిగి తెలంగాణలో బతుకు అంధకారమైందని రైతులు, ఆటో కార్మికులు, నిర్మాణ రంగంలో ఉండే కూలీలు అట్టడుగు స్థాయి నుంచి సంపన్న వర్గాల వరకు అందరూ బాధపడుతున్నారని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను కాపాడుకునేందుకు మరో సంకల్ప దీక్ష కూడా చేపట్టాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. దాని కోసం పార్టీ శ్రేణులు కలిసికట్టుగా ముందుకు పోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
…………………………………………………………..