* ఆదానీ డబ్బులు తీసుకోరాదని నిర్ణయం
* విమర్శల నేపథ్యంలో సృఎం రేవంత్ ప్రకటన
ఆకేరున్యూస్, హైదరాబాద్: అదానీ గ్రూప్‌పై లంచాల విమర్శల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ( TELANGANA STATE) కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (SKILL UNIVERSITY) కి ఇటీవల అదానీ గ్రూప్ ప్రకటించిన రూ.100 కోట్ల విరాళాన్ని స్వీకరించరాదని నిర్ణయించింది. ఈ విషయాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ( CM REVANTHREDDY) విూడియా సమావేశంలో వెల్లడిరచారు. ఆ గ్రూప్‌పై విమర్శల దృష్ట్యా అదానీ ఫౌండేషన్ నుంచి విరాళాన్ని తీసుకోవడం లేదని స్పష్టం చేశారు.
ఈ మేరకు ఆ అదానీ గ్రూపునకు లేఖ పంపినట్లు సీఎం వెల్లడిరచారు. ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమి అదానీపై వివాదానికి, తెలంగాణ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అంబానీ, అదానీ, టాటా ఎవరికైనా తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారం చేసుకునే హక్కు ఉందన్నారు. అయితే ఆదానీపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వందకోట్ల విరాళం తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. అదానీ ఇచ్చిన రూ.100 కోట్లు.. ముఖ్యమంత్రి, మంత్రులకు ఇచ్చినట్లు దునఱష్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. స్కిల్ యూనివర్సిటీకి అదానీ ప్రకటించిన.. రూ.100 కోట్లు స్వీకరించకూడదని తమ ప్రభుత్వం నిర్ణయించిందని ఈ సందర్బంగా సీఎం ప్రకటించారు.
……………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
