![](https://aakerutelugunews.com/wp-content/uploads/2024/11/download-66.jpg)
* ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది ఏమీ లేదు
* కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణలో ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది ఏమీ లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (KISHANREDDY) విమర్శించారు. బెదిరింపులు, తిట్ల పురాణాలు తప్ప ఏమీ సాధించలేదన్నారు. సమస్యలపై మాట్లాడితే నీ డీఎన్ఏ ఏమిటని మాట్లాడుతున్నారని… తన డీఎన్ఏ భారతీయ జనతా పార్టీ అని తెలిపారు. మిగిలిన వారి మాదిరి 10 పార్టీలు మారిన డీఎన్ఏ తనది కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను డిసెంబర్ 1 నుంచి 5 వరకు ప్రజలకు వివరిస్తామని తెలిపారు. రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ భ్రష్టుపడుతోందని… కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒకటేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా నిర్మాణాత్మక పాలనపై దృష్టి సారించాలన్నారు.
……………………………..