* వసతిగృహాలను తనిఖీ చేసిన భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
ఆకేరున్యూస్, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్సి, బిసి బాలికల పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలను భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను సౌకర్యాలు, సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు గీజర్లు ఏర్పాటు చేసి వేడి నీటిని అందించాలని కోరగా కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే, టీ సౌకర్యం కల్పించడంతో పాటు, పోషకాహారం సరిపడా అందించేలా చూడాలని అధికారులకు సూచించారు. విద్యార్థులు గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉంచాలని కోరగా, అవసరమైన అన్ని పుస్తకాలు త్వరలోనే ఏర్పాటు చేస్తామని, కావాల్సిన పుస్తకాలు వివరాలు జాభితా ఇవ్వాలని కలెక్టర్ విద్యార్థుల సూచించారు. ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఏమి చదువుతున్నారు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఆహార పదార్థాలు నాణ్యతగా ఉండేలా చూడాలని, బియ్యం, సరుకులు నాణ్యత లేకుంటే తక్షణమే మార్చాలని ఆదేశించారు. నాణ్యత విషయంలో రాజీ పడొద్దని సూచించారు. ఎస్సి హాస్టల్ లో సిసి కెమెరాను పరిశీలించారు. మెనూ పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ అధికారి శైలజ, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రమణా రావు, సహాయ బిసి సంక్షేమ అధికారి క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
…………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
