* ఆసిఫాబాద్ జిల్లాలో అటవీ కార్యాలయం ముందు ధర్నా
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పులి దాడి చేయడంతో ఆసిఫాబాద్ (ASIFABAD) జిల్లాలో ఓ యువతి మృతి చెందింది. చేలో పత్తి తీయటానికి వెళ్లిన అదే గ్రామానికి చెందిన మోర్ లక్ష్మి (21)పై పెద్ద పులి(BIG TIGER) మెడపై దాడి చేసి పట్టుకువెళ్లేందుకు ప్రయత్నం చేసింది. అక్కడే ఉన్న కూలీలు పెద్దగా కేకలు వేయడంతో వదిలేసి అడవిలోకి పెద్ద పులి పారిపోయింది. మెడపై దాడి చేయడంతో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ఆమె ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయింది. పులుల సంచారంతో స్థానికులు భయం భయంగా గడుపుతున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కాగజ్నగర్ అటవీ కార్యాలయం (FORREST OFFICE)ముందు ధర్నా నిర్వహించారు. న్యాయం చేయాలంటూ బంధువులు డిమాండ్ చేశారు. రెండు నెలలుగా పులుల సంచారం ఉందని తెలిసినా అటవీ అధికారులు పట్టించుకోలేదంటూ ఆరోపించారు.
…………………………………….