* సరైన సాక్ష్యాధారాలు లేనందున ఈ నిర్ణయం తీసుకుంటున్నామని గుంటూరు కోర్టు తుది తీర్పు
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రిషితేశ్వరి ఆత్మహత్య కేసును గుంటూరు కోర్టు కొట్టివేసింది. సరైన సాక్ష్యాధారాలు లేనందున ఈ నిర్ణయం తీసుకుంటున్నామని తుది తీర్పు వెలువరించింది. రిషితేశ్వరి స్వస్థలం తెలంగాణలోని వరంగల్. నాగార్జున యూనివర్సిటీలోని ఆర్కిటెక్చర్ కోర్సులో చేరింది. కాగా, 2015 జూలై 14న రిషితేశ్వరి అనుమానాస్పదంగా మృతి చెందగా.. ఆమె మృతదేహం దగ్గర ఓ సూసైడ్ నోట్ కూడా దొరికడంతో పాటు ర్యాగింగ్ కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా సూసైడ్ నోట్లో కూడా పేర్కొంది. గుంటూరు కోర్టులో తొమ్మిదేళ్ల పాటు ఈ కేసుపై విచారణ జరగగా.. చివరకు ప్రాసిక్యూషన్ నేరం నిరూపించలేకపోవడంతో న్యాయస్థానం ఈ కేసును కొట్టివేసింది.
…………………………………………………..