* స్టాఫ్‌నర్స్ అనుమానాస్పద మృతి..?
* మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో నా కూతురికి వైద్యం దొరకలేదని తల్లిదండ్రుల ఆవేదన..
* మా కూతురు ఒంటిపై గాయాలు వున్నాయి.
* మృతదేహంతో హాస్పిటల్ ముందు కుటుంబసభ్యుల ధర్నా
ఆకేరున్యూస్, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని యోధ ప్రైవేట్ హాస్పిటల్లో దారుణం చోటుచేసుకుంది. ఆస్పత్రిలో ఏఎన్ఎంగా విధులు నిర్వహిస్తున్న అప్సర భీ శనివారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. మృతురాలి తల్లిదండ్రులు మదార్ సుల్తాన్ బీ తెలిపిన కథనం ప్రకారం… మా కూతురు ఆస్పత్రి ప్రారంభం నుంచి ఇక్కడే పని చేస్తుందని.. రోజు మాదిరిగా శుక్రవారం రాత్రి 8.30గంటలు విధులకు వచ్చిందని తెలిపారు. తెల్లవారుజామున ఆస్పత్రి సిబ్బంది ఇద్దరు మా ఇంటికి వచ్చి మీ కూతురుకు ఆరోగ్యం బాగాలేదని మమ్మల్ని తీసుకువచ్చారని.. వచ్చేసరికే మా కూతురు చలనం లేకుండా పడిఉందన్నారు.వరంగల్ ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మృతి చెందిందని అక్కడి వైద్యులు తెలిపారు.
మా కూతురు ఒంటిపై గాయాలున్నాయని… ఆస్పత్రిలో ఏదో జరగడంతోనే మృతి చెందిందని మృతురాలి తల్లిదండ్రులు రోదిస్తూ తెలిపారు. మృతురాలికి కుమారుడు ఉన్నాడు. న్యాయం చేయాలని మృతదేహంతో ఆస్పత్రి ఎదుట కుటుంబ సభ్యులు బైఠాయించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో నా కూతురుకి వైద్యం దొరకలేదా తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారి, జిల్లా పోలీసు అధికారులు పర్యవేక్షించి న్యాయం చేయాలని మృతురాలి బంధువులు వేడుకుంటున్నారు.
………………………………………