![](https://aakerutelugunews.com/wp-content/uploads/2024/12/PVS.jpg)
* 22న స్టార్ బ్యాడ్మింటన్ వివాహం
* హైదరాబాద్‌కు చెందిన వెంకటదత్తసాయితో పెళ్లి
* 22న ఉదయపూర్‌లో పెళ్లి.. 24న హైదరాబాద్‌లో రిసిప్షన్
ఆకేరున్యూస్, హైదరాబాద్: స్టార్ బ్యాడ్మింటన్ విజేత పీవీ సింధు పెట్టిపీటలు ఎక్కబోతోంది. హైదరాబాద్‌కు చెందిన 29 ఏళ్ల వెంకట దత్త సాయిని సింధు మనువాడనుంది. వీరి వివాహం ఈనెల 22న ఉదయ్‌పూర్‌లో అంగరంగా వైభవంగా జరగనుంది. ఈ విషయాన్ని సింధు తండ్రి పీవీ రమణ వెల్లడిరచారు. కాగా, సింధు పెళ్లి చేసుకునే వెంకట దత్త సాయి.. పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. 24న హైదరాబాద్‌లో రిసెప్షన్ ఉంటుందని పీవీ రమణ తెలిపారు.
……………………………..