Station Ghanpur Suicide News
* తమ్ముడు ఆత్మహత్య
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ :
అన్న చనిపోయాడన్న మనోవేదనతో తమ్ముడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండల కేంద్రంలో శనివారం జరిగింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు, పోలీసులు తెలిపిన కథనం ప్రకారం… మండల కేంద్రానికి చెందిన గొడుగు కవిత- ఆంజనేయులు పెద్ద కుమారుడు గొడుగు సంపత్ నాలుగు నెలల క్రితం మృతి చెందాడు. అన్న మృతి చెందాడని మనోవేదన చెందుతున్న గొడుగు గోపాల్ (21) శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సైలు వినయ్ కుమార్, మనిషాలు శవ పంచనామ జరిపించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ జి.వేణు తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
