
* డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
ఆకేరు న్యూస్ ,హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్ద పీట వేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్కమార్క అన్నారు. మహిళలు 200 కోట్ల ఉచిత ప్రయాణాల ద్వారా రూ. 6,680 కోట్లు ఆదా చేసుకున్నారని డిప్యూటీ సీఎం శ్రీ Bhatti Vikramarka Mallu అన్నారు. 200 కోట్ల మహిళల ఉచిత ప్రయాణాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో పండుగ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని డిప్యూటీ సీఎం అన్నారు. రాష్ట్రంలోని మహిళలు పిల్లల చదువుల కోసం, దేవాలయాల సందర్శన, నగరాల్లో ఉద్యోగం వంటి పనుల కోసం ఆర్టీసీ సేవలను మహాలక్ష్మి పథకం ద్వారా ఉపయోగించుకొని ఆర్థికంగా ప్రయోజనం పొందాలని డిప్యూటీ సీఎం తెలిపారు. ఆర్టీసీ మునిగిపోయే పడవ అని ఆరోజు అన్నారు, ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పుడు ఆర్టీసీ లాభాల్లోకి వచ్చి నిలదొక్కుకుందని డిప్యూటీ సీఎం వివరించారు. 200 కోట్ల ప్రయాణాలకు అయిన ఖర్చు రూ. 6,680 కోట్లు ఆడబిడ్డల పక్షాన ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లిస్తుందని తెలిపారు. భవిష్యత్తులోనూ ఆడబిడ్డల ఆర్టీసీ చార్జీలను రాష్ట్ర ప్రభుత్వమే ఆర్టీసీకి చెల్లిస్తుందని అన్నారు.
ఒకప్పుడు ఆర్టీసీ ఆక్యుపెన్సి రేషియో 60% ఉంటే, మహాలక్ష్మి పథకం ద్వారా అది 97%కు పెరిగిందని తెలిపారు. మహాలక్ష్మి పథకానికి ముందు ఆర్టీసీలో 45 లక్షల మంది ప్రయాణం చేస్తే, ఇప్పుడు వారి సంఖ్య 65 లక్షలకు చేరుకుందని వివరించారు.
……………………………………………..